రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) భగవంతుడిని కూడా వదల్లేదని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని(Perni nani).

రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) భగవంతుడిని కూడా వదల్లేదని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని(Perni nani). వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని(Kodali nani), వల్లభనేని వంశీలతో(Vallabhaneni vamsi) కలిసి మీడియాతో మాట్లాడిన పేర్ని నాని కూటమి పాపాన్ని ప్రక్షాళన చేయాలని పార్టీ భావించిందని చెప్పారు. తిరుమలలో(Tirumala) నెయ్యిని వెనక్కి పంపామని టీటీడీ(TTD) ఈవో శ్యామలరావు(Shyamala Rao) చెబుతున్నా చంద్రబాబు(Chandrababu), లోకేశ్‌(Lokesh) మాత్రం అబద్ధాలు చెబుతున్నారన్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని విమర్శించారు. 'తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చెప్పారు. అలాంటిదేమీ లేదని ఈవో శ్యామలరావు చెబుతున్నారు. అయినా చంద్రబాబు అడ్డమైన ఆరోపణలు చేశారు. లోకేష్ అయితే ఏకంగా పందికొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు' అని పేర్ని నాని తిట్టిపోశారు. ' డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఆవే తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేయాలని వైసీపీ భావించింది. వారి పాపాలను క్షమించి వదిలేయమని శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తున్నాం' అని చెప్పారు. శరీరం, ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటేనని, అందుకే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇస్తే వాటికి పవన్ కూడా హామీ ఇచ్చారని, బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మకు రూ.18 వేలు.. ఇలా చాలా చాలా చెప్పారని, అవేమీ అమలు చేయలేదు కాబట్టి వారంతా లోలోపల మదనపడుతున్నారని పేర్ని నాని విమర్శించారు. అందుకే పవన్‌ కల్యాణ్‌ పాపపరిహార్ధం ప్రాయశ్చిత్త శిక్ష వేసుకున్నారని అన్నారు .తాను బాప్టిజం తీసుకున్నట్టు ఇంతకు ముందు పవన్ చెప్పిన విషయం ప్రజలకు ఇంకా గుర్తుండే ఉంటుందని తెలిపారు. 'నెయ్యి వెయ్యి రూపాయలు ఉందని చంద్రబాబు అంటున్నారు.మరి ఆయన హయాంలో ఏనాడైనా వెయ్యి రూపాయలకు కొన్నారా? జగన్ ప్రభుత్వం కంటే తక్కువ ధరకే చంద్రబాబు హయాంలో కొనుగోలు చేశారు.హెరిటేజ్ లో ఆవునెయ్యి నాలుగు వందలకు ఎలా ఇస్తున్నారు’అని పేర్ని నాని ప్రశ్నించారు. కొడాలి నాని కూడా చంద్రబాబు తీరును ఎండగట్టారు. స్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు. ' మా హయాంలో 18 సార్లు కల్తీ ట్యాంకర్లను వెనక్కు పంపాం. ప్రతి ట్యాంకర్‌ను నిబంధనలకు అనుగుణంగా టెస్టులు చేశాం. వందల ఏళ్లుగా ఇలాంటి ఆనవాయితీ కొనసాగుతోంది. జులై 17వ తేదీ న ఒక ట్యాంకర్‌లో నెయ్యి సరిగా లేదని వెనక్కి పంపారు. ఆ నెయ్యిని లడ్డూలో వాడలేదు. కానీ చంద్రబాబు మాత్రం అడ్డమైన ఆరోపణలు చేశారు. అపవిత్రమైన లడ్డూలను భక్తులు తిన్నారని చంద్రబాబు అన్నారు. జగన్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు బుద్ది రావాలని వెంకటేశ్వర స్వామి ని కోరుకుంటున్నాం' అని కొడాలి నాని చెప్పుకొచ్చారు. 'వెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. ఏ ల్యాబ్ కూడా కల్తీలు జరిగినట్టు రిపోర్టు ఇవ్వలేదు. కల్తీ జరిగే అవకాశం ఉందని మాత్రమే చెప్పాయి. దాన్ని పట్టుకుని చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు. చంద్రబాబు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడేనా?

నిజమైన భక్తుడే అయితే ఎన్నిసార్లు తలీలాలు అర్పించారో చెప్పాలి' అంటూ నిలదీశారు. చంద్రబాబు చేసిన పాపానికి ఆయనకే శిక్ష వేయాలన్నారు కొడాలి నాని.

Updated On
Eha Tv

Eha Tv

Next Story