ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన 529 కోట్ల ప్రభుత్వ భూమిని కేవలం 99 పైసలకు టిసిఎస్ సంస్థకు అమ్మడం పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన 529 కోట్ల ప్రభుత్వ భూమిని కేవలం 99 పైసలకు టిసిఎస్ సంస్థకు అమ్మడం పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టీసీఎస్‌ సంస్థకు 21.16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని జీవో ఎంఎస్ నెంబర్ 7 ద్వారా ఆంధ్రప్రదేశ్ (Ap)రాష్ట్ర ప్రభుత్వం టిసిఎస్ సంస్థకు కేటాయించింది. నిబంధనలకు వ్యతిరేకంగా భూ కేటాయింపు జరగటంతో జై భీమ్రావు భారత్ పార్టీ కార్యదర్శి నక్క నిమ్మి గ్రేస్(Nakka Nimmi Grace)హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫెరా స్ట్రక్చర్ కార్పొరేషన్ ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ 2023 ( APIIC) విరుద్ధంగా భూ కేటాయింపు జరిగిందన్న పిటీషనర్. చట్టంలో ఎక్కడా కూడా ప్రాజెక్టు పూర్తికాకుండానే పూర్తిస్థాయిలో సేల్ డీడ్ ద్వారా భూ కేటాయింపు జరగాలన్న నిబంధనను పాటించకుండా భూ కేటాయింపు జరిగిందన్న పిటీషనర్. కేవలం లీజు పద్ధతిలో మాత్రమే భూ కేటాయింపు జరగాలని అలాట్మెంట్ రూల్స్ చెబుతున్నప్పటికీ దానికి విరుద్ధంగా సేల్ డీడ్ పద్ధతిలో భూ కేటాయింపు జరగటానికి అవకాశం లేదన్న పిటిషనర్. కేవలం టిసిఎస్ (TCS)సంస్థతో క్విట్ ప్రోకో విధానంతో భూ కేటాయింపు జరిగిందన్న పిటిషనర్. ఒక్క ఇటుక కూడా వేయకుండా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని 99 పైసలకు అప్పజెప్పడంపై ప్రభుత్వ నిర్లక్ష్యం అధికార దుర్వినియోగం కనపడుతుందన్న పిటిషన్‌లో పేర్కొన్న పిటిషనర్. తక్షణమే ఈ జీవోను సస్పెండ్ చేస్తూ లీస్ పద్ధతుల్లో మాత్రమే భూ కేటాయింపు జరగాలన్న పిటిషనర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని కచ్చితంగా న్యాయస్థానం నిలువురుస్తుందన్న పిటిషనర్

ehatv

ehatv

Next Story