Tirumala : తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమల(Tirumala) కు వచ్చిన భక్తులతో పోటెత్తింది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతున్నదని టీటీడీ(Tirumala Tirupathi Devasthanam) ప్రకటనలో పేర్కొంది. భక్తుల అధిక రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ ఎస్ […]

Pilgrim rush continues in Tirumala
తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమల(Tirumala) కు వచ్చిన భక్తులతో పోటెత్తింది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతున్నదని టీటీడీ(Tirumala Tirupathi Devasthanam) ప్రకటనలో పేర్కొంది. భక్తుల అధిక రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ ఎస్ డి టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారని టీటీడీ తెలిపింది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 50 వేల మంది యాత్రికులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారని టీటీడీ ప్రకటనలో పేర్కొంది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 79 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 80 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించామని.. అంతే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారమని ప్రకటనలో తెలిపింది.
