Pithapuram Cadre Survey : పిఠాపురంలో పరిస్థితి ఏంటి.. వర్మ లేకుంటే పవన్ పరిస్థితి ఏంటి..ఓ రిపోర్ట్..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్ల నియోజకవర్గంపైనే ఎక్కువగా చర్చ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్ల నియోజకవర్గంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. అసెంబ్లీ స్థానాలలో పిఠాపురం 2024 ఎన్నికల నుంచి పిఠాపురం (Pitapuram)గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఇందుకు కారణం ఇక్కడ జనసేన అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నిలబడి పోటీ చేసి గెలిచారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ సీనియర్ నాయకుడైన వర్మ(Varma)ను టీడీపీ (TDP) ఒప్పించి, పవన్‌కు ఆ స్థానం కేటాయించింది. వర్మ కూడా సహకరించి పవన్ గెలుపునకు కష్టపడ్డారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత జనసేన (Janasena)బలం ఎంత ఉంది ఆ పార్టీ జోరు ఎంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పిఠాపురం టీడీపీకి బలమైన స్థానం. ఇక్కడ వైసీపీ (Ycp)కూడా చాలా బలంగాగానే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ జసేనపార్టీ బలాన్ని పెంచుకున్నారని చర్చ జరుగుతోంది. గత పది నెలలలో జనసేనపార్టీ(jsp) ఏ విధంగా ముందుకు వెళ్లింది. పిఠాపురంలో ఎక్కువగా కాపు సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి. టీడీపీ మాస్ లీడర్ వర్మ ఇక్కడ బలంగా ఉన్నారు.
పిఠాపురంలో జనసేన బాగానే పుంజుకుంది అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యాక జనసేన మంచి ఊపులో ఉందని అంటున్నారు. 9 నెలల్లో రూ. 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టారు. వ్యవసాయ యంత్రాలు, కుట్టు శిక్షణ కేంద్రాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ లాంటివి జరుగుతున్నాయి. పిఠాపురం నీటి సంఘాల ఎన్నికల్లో జనసేన ఏకగ్రీవంగా 11 చైర్మన్ పదవులు, 180 సభ్యత్వాలు గెలుచుకుంది. మార్చి 2025లో పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రసంగంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. సాగు నీరు, తాగు నీరు, డ్రైనేజీ, సుద్ద గడ్డ రిజర్వాయర్ పనులపై ఫోకస్ చేస్తున్నారు. పిఠాపురం ఏరియా డవలప్మెంట్ అథారిటీ (PADA) ఏర్పాటు చేసి సంపూర్ణ అభివృద్ధికి ప్లాన్ చేస్తున్నారు. జనసేన పిఠాపురంలో గ్రౌండ్ లెవెల్‌లో బలపడింది, అభివృద్ధి పనులతో పాటు పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫోకస్, కూటమి బలంతో జనసేన మంచి ఊపులో ఉంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు కాపులతో మంచి అనుబంధం కూడా ఉంది. పార్టీ పరంగానే కాకుండా స్థానికంగా కూడా మంచి గ్రిప్ ఉంది. బూత్ స్థాయిలో కూడా వర్మకు క్యాడర్ బలంగా ఉంది. పొలిటికల్ పరంగా ఆయన అక్కడ స్ట్రాంగ్ నేతగా పేరు సంపాదించారు. అయితే ఇలాంటి వ్యక్తి కాకుండా పవన్ కళ్యాణ్‌ని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని గెలిపించారు. ఇక నాగబాబు పిఠాపురంలో పర్యటించినప్పుడు టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య పోటాపోటీ నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అయితే బూత్ స్థాయిలో జనసేనకు క్యాడర్ లేదని.. పొత్తులేకుంటే మాత్రం జనసేన టీడీపీ, వైసీపీ కంటే వెనుకబడి ఉందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
