ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ఆయన టైంటేబుల్‌ ఖరారైంది .

ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ఆయన టైంటేబుల్‌ ఖరారైంది . మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. సచివాలయం వెనక బహిరంగ సబా వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్(K Vijayanand), పర్యటన నోడల్‌ అధికారి వీరపాండ్యన్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని వెల్లడించారు. ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated On
ehatv

ehatv

Next Story