PM Modi : మాధవి లత తరుపున ప్రచారం చేయనున్న మోదీ
హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

PM Modi to campaign for BJP Hyderabad MP candidate
హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, నారాయణపేట జిల్లాల్లో కూడా ప్రధాని మోదీ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మే 10న వచ్చే శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేటలో బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మే 8వ తేదీ బుధవారం వరంగల్‌లోని మడికొండ, వేములవాడలలో బీజేపీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఈ సభలకు కూడా జాతీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇదిలావుంటే.. నిన్న అమిత్ షా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. 1984 నుండి హైదరాబాద్ స్థానంలో ఓటమి ఎరుగని ఏఐఎంఐఎం సీటును కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ హైదరాబాద్‌లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సీటుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.
