అదేంటీ ఇప్పటి వరకు శ్రీరెడ్డిపై(Sree reddy) కేసులు పెట్టలేదా అని అనుకున్నారు కదా!

అదేంటీ ఇప్పటి వరకు శ్రీరెడ్డిపై(Sree reddy) కేసులు పెట్టలేదా అని అనుకున్నారు కదా! ఇప్పుడా ముచ్చట కూడా తీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu), ఆయన ఫ్యామిలీ మెంబర్లపై సోషల్‌ మీడియాలో(Social media) అసభ్యకరంగా వీడియోలు పోస్టు చేసినందుకు మల్లిడి శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి(Godhavari) జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణంలోని మోరంపూడికి చెందిన తెలుగుదేశంపార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి స్థానిక బొమ్మూరు పోలీసుస్టేషన్‌లో ఈ మేరకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితపై కూడా అగౌరకరంగా, అమర్యాదగా వీడియోలు పెట్టారని ఫిర్యాదులో మజ్జి పద్మావతి పేర్కొన్నారు. అలాగే అనంతపురం నగరానికి చెందిన తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కూడా శ్రీరెడ్డిపై బుధవారం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ సాయినాథ్‌కు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం కంచరపాలెం పోలీసుస్టేషన్‌లో కూడా శ్రీరెడ్డిపై ఫిర్యాదు నమోదైంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story