ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ చెవిలో జోరీగలా తయారయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ చెవిలో జోరీగలా తయారయ్యారు. రోజుకో ట్వీట్‌తో పవన్‌ను తెగ సతాయిస్తున్నారు. లేటెస్ట్‌గా పవన్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. పాలిటిక్స్‌లో పవన్‌ ఫుట్‌బాల్‌లాంటి వారని, ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారని చెప్పాడు. తిరుపతి(Tirupati)లో పవన్‌ గొంతు చించుకుని చెప్పిన సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవన్నారు ప్రకాశ్‌రాజ్‌. కేవలం బీజేపీ (BJP)మాత్రమే అలా అనుకుంటున్నదని చెప్పారు. హీరోగా అనేక సినిమాల్లో అనేక పాత్రలు పోషిస్తారని, రాజకీయం అలా కాద‌ని పవన్‌ తెలుసుకోవాలని ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj) సూచించారు. వపన్‌కు ఓ స్థిర‌మైన ఆలోచ‌న ఉంటే బాగుంటుందని హిత‌వు ప‌లికారు. మొన్న ఎంజీఆర్‌(MGR)పై ప‌వ‌న్ చేసిన ట్వీట్‌పై కూడా ప్రకాశ్‌రాజ్‌ సైటెర్లు వేశారు. ఉన్నట్టుండి ఎంజీఆర్‌పై ఎందుకింత ప్రేమో అని ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story