సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash) ఏ పోస్టు పెట్టినా అది పవన్‌కల్యాణ్‌ను(Pawan kalayan) ఉద్దేశించిదేనని అనిపిస్తోంది.

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash) ఏ పోస్టు పెట్టినా అది పవన్‌కల్యాణ్‌ను(Pawan kalayan) ఉద్దేశించిదేనని అనిపిస్తోంది. అందుకు కారణం కొన్ని రోజులుగా ఆయన పవన్‌ను క్రిటిసైజ్‌(Criticism) చేస్తూ పోస్టులు పెట్టడమే. మొదట్లో పవన్‌ పేరును ప్రస్తావిస్తూ అతడిని ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో పోస్టులు పెట్టిన ప్రకాశ్‌రాజ్‌.. ఇప్పుడు పవన్‌ పేరును ప్రస్తావించకుండా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ప్రకాశ్‌రాజ్‌ ఓ ట్వీట్(Tweet) చేశారు. అక్టోబర్‌ 2వ తేదీ మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి కాబట్టి ఆ మహానుభావులిద్దరి కొటేషన్లను గుర్తు చేశారు ప్రకాశ్‌రాజ్‌. 'నువ్వు మైనారిటీలలో ఒకడివి అయినప్పటికీ నిజం ముమ్మాటికీ నిజమే' అంటూ ఓ పోస్ట్‌ పెట్టారు. 'మనకు గుళ్లు, గురుద్వారాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి. కానీ వీటిని ఎప్పుడూ రాజకీయాల్లోకి లాగలేదు. ఇదే భారత్, పాకిస్థాన్ మధ్య తేడా' అంటూ లాల్ బహదూర్ శాస్త్రి కొటేషన్‌ను పోస్ట్‌ చేశారు. ఈ రెండు కొటేషన్లను నిశితంగా గమనిస్తే ఇవి కూడా పవన్‌ కల్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు చేసినట్టుగానే ఉన్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story