బీసీ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

బీసీ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి కృష్ణయ్య రాజీనామా చేశారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ్య చైర్మన్ కూడా ఆమోదించారు. ఇటీవలే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణలు కూడా రాజీనామా చేశారు. తాజా రాజీనామాతో ఆర్ కృష్ణయ్య వీరి సరసన చేరారు. ఆర్. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 8కి పడిపోయింది.

ఆర్. కృష్ణయ్య త్వరలో బీజేపీలో చేర‌నున్నట్లు తెలుస్తుంది. బీసీ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన‌ బీజేపీ.. కృష్ణయ్యను పార్టీలో చేర్చుకునే దిశ‌గా పావులు క‌దిపిన‌ట్లు తెలుస్తుంది. ఆ చ‌ర్చ‌ల ఫ‌లిత‌మే కృష్ణయ్య రాజీనామా ప్ర‌క‌ట‌న అని అంతా భావిస్తున్నారు. అయితే ఎంతో గౌర‌వంతో జ‌గ‌న్ కేటాయించిన సీటుకు రాజీనామా చేయ‌డం ప‌ట్ల వైసీపీ శ్రేణులు మాత్రం అసంతృప్తిగా ఉన్నాయి.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story