Raithu Bharosa: అన్నదాతలను మెసం చేయడం కాదా..!
Raithu Bharosa: అన్నదాతలను మెసం చేయడం కాదా..!
ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు తొలి ఏడాది అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ప్రతి నియోజక వర్గంలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటూ పార్టీ కార్యకర్తల్ని ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కోరింది. సో ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. ఏడాది కాలంలో చేసిన అద్భుతాలు ఇవి అంటూ ప్రజల దగ్గరికి చెప్పే ప్రయత్నం. ప్రతి ఇంటికి వెళ్తారు అనుకున్నాం, బట్ ప్రతి ఇంటికి వెళ్ళట్లా, నియోజకవర్గంలో ఒకటి, రెండు మీటింగలు పెడుతున్నారు. దీంట్లో బిజెపి, జనసేన పెద్దగా పార్టిసిపేట్ చేసినట్టు కనపట్లేదు, సరే అవి పక్కన పెడితే ఏడాది కాలంలో చేసిన అద్భుతాల గురించి అధికార పార్టీ చెప్పుకోవడం తప్పేం కాదు, అద్భుతాలు ఉంటే డెఫినెట్ గా చెప్పుకోవచ్చు, సో అద్భుతాల విషయం పక్కన పెడితే, ఏడాది కాలంలో చేసిన మోసాలకు సంబంధించిన చర్చ కంటిన్యూస్ గా జరుగుతుంది, ఏడాది కాలంలో చేసిన మోసాలు ఏంటి, ఏడాది కాలంలో చేసిన మోసాలకు సంబంధించిన చర్చ రేపటితో మరోసారి ఉధృత రూపం తీసుకునే అవకాశం కనపడుతుంది. ఏంటి రేపు మళ్ళీ ఆ చర్చ అంటే. రేపు రైతు భరోసాకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో వేయబోతుంది. రైతు భరోసాని 20వేల రూపాయలు ఇస్తామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చింది. సో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత మొదటి ఏడాదిలో ఒక్క రైతుకు కూడా రైతు భరోసా నిధులను జమ చేయలేదు, దాదాపు 50 లక్షల కు పైగా ఉన్న రైతులకు ప్రతి రైతుకు 20,000 ఇవ్వాల్సిన రైతు భరోసా ఒక్క రూపాయి కూడా కూటమి సర్కారు తొలి ఏడాదిలో ఇవ్వలేదు. ఇది ఏ రకంగా సుపరిపాలన, ఏ రకంగా తొలి అడుగు, ఈ ప్రశ్నకు సర్కార్ దగ్గర నుంచి ఆన్సర్ కనిపించదు, కనిపించట్లేదు. సో మొదటి ఏడాది ఇవ్వలేదు ఎగ్గొట్టారు, మొదటి ఏడాది తల్లికి వందనం కూడా ఇవ్వలేదు ఎగ్గొట్టారు, సో ఇప్పుడు రెండవ ఏడాది రైతు భరోసా రేపు ఇవ్వబోతున్నాం అంటూ, రేపు తెలుగుదేశం పార్టీ పత్రికల అన్నిటికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు కూడా ఇస్తారు, తెలుగుదేశం పత్రికలకు ప్రకటనలు వస్తున్నాయి. తెలుగుదేశం నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు కానీ, రైతు భరోసా మీరు నాలుగు విడతలుగా వేస్తామని చెప్పారా, 5000 రూపాయలు ఇప్పుడు వేస్తామంటే, మిగతా 15000 సంగతి ఏంటి, ఇప్పుడు వేయాల్సింది 5000 ఎందుకు అవుతుంది, 40,000 కదా. గత ఏడాది కలుపుకుంటే, గత ఏడాది ఏడాది కలిపి ప్రతి రైతుకు అందాల్సిన 40,000లో రేపు మేము 5000 రూపాయలు వేస్తాం, సంబరాలు చేసుకోండి అంటే ఇది మోసం కాకపోతే ఏమవుతుంది. ఇది మోసం చేయడం ఎందుకు కాదు, ఇది మోసం అయితే, మోసం కాకుండా సంబరం చేసుకుంటాం, అద్భుతం చేశామని ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ YNR విశ్లేషణ..!
