Rayalaseem Project Controversy: రేవంత్‌రెడ్డికి చంద్రబాబు షాక్..!
Rayalaseem Project Controversy: Chandrababu shocks Revanth Reddy..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట పనులు ఆపటానికి నేనే కారణం, నేను క్లోజ్డ్ రూమ్‌లో చంద్రబాబు నాయుడుని కోరడంతో, నా మీద గౌరవంతో ఆయన రాయలసీమ లిఫ్ట్ కి సంబంధించిన పనులని ఆపివేశారు. తెలంగాణ శాసన సభ వేదికగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. ఈ అంశం నిజమో కాదో తేల్చుకోవాలంటే శాసన సభలోని అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతినిధులతో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం, ఆ కమిటీని రాయలసీమ లిఫ్ట్ పనులు జరుగుతున్న ప్రదేశానికి పంపిద్దాం, అక్కడికి వెళ్లి వాళ్ళు చూసి పనులు జరుగుతున్నాయా, ఆగిపోయాయో తెలుసుకోవచ్చు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా తనకు చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, తనకు చంద్రబాబుకు తనపైన ఉన్న గౌరవం కారణంగా, తాను రిక్వెస్ట్ చేసిన కారణంగా, ఆయన ఆ పనులు ఆపేసి తెలంగాణకు మంచి చేశారు అనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఓ రకంగా చంద్రబాబుని పొగిడినట్టున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో చంద్రబాబుని విలన్ని చేసిన స్టేట్మెంట్ ఇది. తమ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోరారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపేశారు అనే అపవాదు, అనే విమర్శ చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి ఈ ప్రకటన తర్వాత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన, ప్రతిపక్ష పార్టీలు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మేధావులు, ఈ అంశం పైన ప్రభుత్వం స్పందించాలి, రాయలసీమ ప్రాంతానికి ఏ రకంగా అన్యాయం చేస్తారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కోట్లాది మంది ప్రజలకు భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తే ఎలా అంటూ మాట్లాడడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన రేవంత్ రెడ్డికి షాక్‌ని ఇచ్చే ప్రకటనగా ఉంది. ఈ ప్రకటన సారాంశాన్ని ఒకసారి చూస్తే మేము రాయలసీమ లిఫ్ట్ పనులని ఆపేయలేదు అనే మాట కంటే, రాయలసీమ లిఫ్ట్ పనులు ఎప్పుడో ఆగిపోయాయి అనే మాట ఆ ప్రకటనలో ఉంది. రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబు ఆపేశారు, రేవంత్ రెడ్డి కోరిన మీదట అనే అంశం శుద్ధ తప్పు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. రేవంత్ రెడ్డి కోరింది లేదు, చంద్రబాబు అంగీకరించింది లేదు, చంద్రబాబు అంగీకరించి పనులు ఆపేయించింది లేదు, నిజానికి ఆ పనులు 2020వ ప్రాంతంలోనే ఆగిపోయాయి, 2020 లో ఎటువంటి అనుమతులు లేకుండానే జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాయలసీమ లిఫ్ట్ కి సంబంధించిన పనులు మొదలు పెడితే అప్పుడు, ఎన్జీటీ దీనిపైన అభ్యంతరం చెప్తే పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత ఎన్జీటీలో దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం అప్పటి ప్రభుత్వం చేయలేదు, అప్పుడు ఈ ప్రాజెక్ట్ పైన తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది. కేంద్రానికి బిఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఆధారంగా ఈ పనులు అప్పుడు ఆగిపోయాయి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్‌ను ఇచ్చే ఒక ప్రకటన చేసింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్‌ను ఇచ్చే ఒక ప్రకటన చేశారు. ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తున్న వాళ్లకు అనూహ్యం ఆసక్తికరం. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


