దర్శక, నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

దర్శక, నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(CM Chnadrababu naidu), నారా లోకేశ్‌(Nara Lokesh), జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan kalyan)లను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయనపై కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ (Anticipatory Bail), ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టుకు పిటిషన్‌ దాఖలు చేశారు వర్మ. దీనిపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్నది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు ఆర్జీవీని అరెస్ట్‌ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని రామ్‌గోపాల్‌వర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను కామెంట్ చేసిన వ్యక్తులు కాకుండా సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని తెలిపారు. తనపై ఎఫ్ఐఆర్‌ (FIR)లు నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు.

Updated On
ehatv

ehatv

Next Story