Road accident in America.. Telugu couple dies

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్‌ (టిన్ను) (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్ (టిన్ను, 45), ఆశ (40) దంపతులు మరణించారనే వార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది. వారి కుమార్తె మరియు కుమారుడికి తీవ్ర గాయాలు కావడం మరింత బాధాకరం.కృష్ణ కిశోర్‌ పదేళ్లకు పైగా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ దంపతులు 10 రోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. మార్గంమధ్యలో దుబాయ్‌లో న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొన్నారు. వీరి మృతితో పాలకొల్లులో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story