RTC Bus Accident : అల్లూరి జిల్లాలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాళ్లోకెళితే.. పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది. చెట్టు కొమ్మను తప్పించబోయిన డ్రైవర్..

RTC bus fell into a valley in Alluri district
అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitaramaraju DistricT)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. వివరాళ్లోకెళితే.. పాడేరు(Paderu) ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది. చెట్టు కొమ్మను తప్పించబోయిన డ్రైవర్.. బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి పడిపోయినట్లు తెలుస్తోంది. మోదమాంబ పాదాలకు మూడు కిమీ దూరంలో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు చోడవరం నుంచి పాడేరు వెళుతుం డగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
