Rushikonda: Should Rushikonda Palace be demolished?

ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం విశాఖ రిషికొండ ప్రాంతంలో నిర్మించిన ప్యాలెస్‌లకు సంబంధించిన చర్చ, బిల్డింగలకు సంబంధించిన చర్చ, ప్యాలెస్ అనే ప్రచారం గతంలో ప్రతిపక్ష పార్టీ చేస్తూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి, అక్కడ ఒక ప్యాలెస్ నిర్మించారు, ఒక రాజ ప్రసాదం తరహా ప్యాలెస్ ని నిర్మించుకున్నారు. తన కోసం అంటూ అప్పుడు పార్టీలు మాట్లాడం , ప్రస్తుతం కూడా అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడడం చూస్తున్నాం. రిషికొండలో దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక భారీ భవంతిని నిర్మించారు. అది జగన్మోహన్ రెడ్డి విలాసాల కోసం నిర్మించిన భవనం అంటూ క్యాంపెయిన్ చేశారు. క్యాంపెయిన్ చేయడం మాత్రమే కాదు, ఆ సందర్భంగా ఆ భవనాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు అక్కడ నిర్మాణాన్ని చేపట్టకూడదు, అని చెప్తున్న వాళ్ళంతా మాట్లాడిన మాట తెలుగుదేశం, జనసేన భారతీయ జనతా పార్టీ కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు కూడా అప్పుడు మాట్లాడిన మాట రిషికొండ, ఒక రిషికొండ లాంటి ఒక ప్రాంతంలో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. ఓ కొండకి గుండు కొట్టేస్తున్నారు, ఇలా చేస్తే పర్యావరణం పరిస్థితి ఏంటి, సముద్రం పక్కనున్న ఒక నిర్మాణాన్ని, ఒక కొండని తొలిచి, అక్కడ నిర్మాణాలు చేపట్టడం అనేది విశాఖపట్టణానికి ఏమాత్రం మంచిది కాదు, ఆ కొండ అలా ఉండడం వల్ల పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చిన సందర్భంగా, విశాఖపట్టణాన్ని కాపాడుతూ ఉంది. ఆ కొండని కొట్టేస్తే, ఆ కొండని తొలిచేస్తే విశాఖపట్టణమే ప్రమాదంలో పడిపోతుంది, అంటూ అనేకమంది మాట్లాడడం, ప్రధానంగా ఆ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూడా మాట్లాడిన మాట. పర్యావరణం అందరి కన్సన్ కూడా ఒక్కటే, ఆ కొండకలా గుండు కొట్టొద్దు అని అందరి కన్సన్ కూడా ఒక్కటే. అక్కడ నిర్మాణాలు చేపట్టడం అనేది విశాఖపట్నం ప్రాంతానికి ప్రమాదం అని, ఈ కారణంగానే అనేకమంది ఎన్జీటీలో కేసులు వేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్లి కేసులు వేసి ఆ బిల్డింగ్స్ ని ఆపించడానికి సంబంధించిన ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి పోరాటమ చేశారు. ఈ మొత్తం అన్ని సందర్భాల్లో అందరూ మాట్లాడిన మాట ఆ బిల్డింగ్ ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ మాట్లాడిన మాట ఒకే ఒక మాట సింగిల్ పాయింట్ ఎజెండా. పర్యావరణానికి విఘాతం కలుగుతుంది కాబట్టి, ఆ బిల్డింగ్లు ఎక్కడ కట్టకూడదు, కొండకి గుండు కొట్టడం కూడా పర్యావరణాన్ని విఘాతం కలిగించడమే, అందరూ మాట్లాడిన మాట. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్డింగ్స్ నిర్మాణాలు పూర్తి పూర్తయ్యాయి కాబట్టి, ఆ బిల్డింగ్ ఏం చేయాలనే దానిపైన ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ ఉపసంఘం ఇటీవల కొన్ని సిఫారసులు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story