TTD : టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా బుధవారం ఆరుగురు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

Six members of the Board of Trustees of TTD took oath
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు(TTD Board Members)గా బుధవారం ఆరుగురు తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ ఎక్స్అఫీషియో సభ్యులుగా, వై.సీతారామిరెడ్డి(Y Seetharami Reddy), బాలసుబ్రమణియన్ పళనిస్వామి (Palaniswamy), ఆర్.వెంకటసుబ్బారెడ్డి(Venkatasubbareddy), సిద్దవటం యానాదయ్య(Siddhavatam Yaanadaiah), సిద్ధా వీరవెంకట సుధీర్ కుమార్(Siddha Veeravenkata Sudheer Kumar) ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం(Veerabramham) వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు లోకనాథం(Lokanatham), గోవిందరాజన్(Govindarajan), హరీంద్రనాథ్(Hareendranath) తదితరులు పాల్గొన్నారు.
