రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్‌’ను ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్‌’ను ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌(SIT)కు చీఫ్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ (Vineet Brijlal)వ్యవహరించనున్నారు. సిట్‌ సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్‌(Umamaheswar), డీఎస్పీలు అశోక్‌ వర్ధన్‌(Ashok Vardhan), గోవిందరావు(Govindharao), డీఎస్పీలు బాలసుందర్‌రావు(Balasundarrao), రత్తయ్యలను(Rattaiah) నియమించారు. ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సిట్‌కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించింది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ(Kakinada)లో 13 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

Updated On
ehatv

ehatv

Next Story