సోషల్ మీడియాలో(Social media) చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి(Sri reddy) తెలుగు రాష్ట్రాలలో చాలా పాపులర్‌.

సోషల్ మీడియాలో(Social media) చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి(Sri reddy) తెలుగు రాష్ట్రాలలో చాలా పాపులర్‌. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు(Chandrababu), లోకేశ్‌(Lokesh), పవన్‌ కల్యాణ్‌లపై(Pawan kalyan) ఘాటైన విమర్శలు చేశారు. తెలుగుదేశంపార్టీ(TDP) సారథ్యంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త సైలెంటయ్యారు. తాజాగా మళ్లీ ఆమె పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన ఓ వీడియోను ఆమె పోస్ట్‌ చేశారు. భగత్ సింగ్ గురించి పవన్‌ చెప్పిన మాటల వీడియో అది. అందులో పవన్‌ ఏమన్నారంటే 'మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కరు ఎన్నో త్యాగాలు చేశారని, భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు' అని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన శ్రీరెడ్డి ఓరి మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయ్యారు రా బాబు అనే డైలాగును కలిపారు. దానికి అనదర్‌ డైమండ్‌ ఫ్రమ్‌ డిప్యూటీ సీఎం అనే క్యాప్షన్‌ ఇచ్చారు. శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story