శ్రీకాకుళం(srikakulam) జిల్లాలో విషాదం నెలకొంది.

శ్రీకాకుళం(srikakulam) జిల్లాలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులను విడిచి ఉండలేక ఓ విద్యార్థిని తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఏడో తరగతి విద్యార్థిని రిబ్బనతో ఉరివేసుకొని ఆత్మహత్యకు(Suicide) పాల్పడింది. పాతపట్నం నియోజకవర్గంలోని మెలియపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో లావణ్య ఏడో తరగతి చదువుతుంది. ఈ మధ్యనే దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన లావణ్యను సెలవులు ముగియడంతో ఆమె తల్లిదండ్రులు స్కూల్‌లో విడిచిపెట్టి ఇంటికి వెళ్లారు. దీంతో లావణ్య మనస్తాపం చెందింది. తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయిన తర్వాత జడ రిబ్బనతో(Hair Ribbon) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించగా వెంటనే టీచర్లు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు తేల్చారు. లావణ్య ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. లావణ్య ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story