జగన్ ఆస్తుల కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

జగన్ ఆస్తుల కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జగన్‌కు లబ్ది జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నారని బీపీ ఆచార్యపై ఈడీ కేసు నమోదు చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 197 చట్టానికి సంబంధించి పీఎంఎల్‌ఏ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని.. అది లేనందున ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ ఆశ్రయించింది. దీంతో ఈడీ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పు సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.

Updated On
ehatv

ehatv

Next Story