తిరుపతి లడ్డూ ప్రసాదంపై మొన్న తాను చేసిన వ్యాఖ్యలే ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిందని రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ ఐవై కృష్ణారావు అన్నారు.

తిరుపతి లడ్డూ ప్రసాదంపై మొన్న తాను చేసిన వ్యాఖ్యలే ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిందని రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ ఐవై కృష్ణారావు(IY Krishna rao) అన్నారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu)పై అన్ని కోణాలను వివరిస్తూ తాను ఓ వీడియో చేశానని, అందులో తమకు అనుకూలంగా ఉన్న భాగాన్ని కట్‌ చేసి సాక్షి ఛానెల్‌ వైరల్ చేసిందని అన్నారు. అది చూసి ఎల్లో యూ ట్యూబర్లు పూర్తి వీడియో చూడకుండా తనపై విరుచుకు పడ్డారని ఐవై కృష్ణారావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ ట్వీట్‌ చేశారు. తనపై విరుచుకుపడిన వారు ఇప్పుడు సుప్రీంకోర్టు(Supreme Court)పై కూడా విరుచుకుపడతారా? అని ప్రశ్నించారు. వారు చెప్పదలుచుకున్న ఒరవడికి అనుకూలంగా అందరూ మాట్లాడాలంటే కుదరకపోవచ్చని కృష్ణారావు తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story