✕
Polavaram-Nallamala Sagar: పోలవరం-నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
By ehatvPublished on 12 Jan 2026 9:02 AM GMT
Polavaram-Nallamala Sagar: పోలవరం-నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

x
పోలవరం-నల్లమల్ల సాగర్ కేసులో తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టు విచారణ అర్హత లేదని తెలిపింది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. తాము పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని తెలిపిన తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి. దీంతో రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ వివరించింది. గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక వాదనలు కూడా వినాల్సి ఉందన్న సుప్రీంకోర్టు.
నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ehatv
Next Story

