Rajya Sabha : నేడు కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం
నేడు కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏపీకి చెందిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు..
![Taking oath of newly elected Rajya Sabha members today Taking oath of newly elected Rajya Sabha members today](https://ehatvsite.hocalwire.in/wp-content/uploads/2024/04/Taking-oath-of-newly-elected-Rajya-Sabha-members-today.jpg)
Taking oath of newly elected Rajya Sabha members today
నేడు కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏపీకి చెందిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు.. తెలంగాణ నుంచి ఎన్నికైన బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇదిలావుంటే.. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 12 మంది సభ్యులతో బుధవారం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సమక్షంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ప్రమాణం చేయించారు. ధర్మశీలా గుప్తా, మనోజ్ కుమార్ ఝా, సంజయ్ యాదవ్, గోవింద్ భాయ్ లాల్జీభాయ్ ధోలాకియా, సుభాష్ చందర్, హర్ష్ మహాజన్, జిసి చంద్రశేఖర్, ఎల్ మురుగన్, అశోక్ సింగ్, చంద్రకాంత్ హందోర్, మేధా విశ్రమ్ కులకర్ణి, సాధన సింగ్ ప్రమాణ స్వీకారం చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
ఇదిలావుంటే.. 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం మంగళ, బుధవారాలతో (ఏప్రిల్ 2 మరియు 3) ముగిసింది. వారిలో 49 మంది మంగళవారం పదవీకాలం పూర్తి చేసుకోగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సహా ఐదుగురి పదవీకాలం బుధవారం పూర్తి చేసుకున్నారు. వారి స్థానంలోనే నూతన సభ్యులు సభలో అడుగుపెట్టబోతున్నారు.
![Yagnik Yagnik](/images/authorplaceholder.jpg)