వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోంచి దింపేయడానికి కూటమి కట్టాయి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోంచి దింపేయడానికి కూటమి కట్టాయి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు! కూటమి కట్టి పోటీ చేశాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని మూడు పార్టీలు సమానంగా కాకపోయినా పంచుకున్నాయి. అయిదేళ్ల వరకు ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా మూడు పార్టీలు సఖ్యంగా పాలన చేస్తాయనుకున్నారు కానీ ఆరు నెలలైనా గడవక ముందే కూటమి పార్టీలైన తెలుగుదేశంపార్టీ(TDP), జనసేన(Janasena)లు కొట్టుకుంటున్నాయి. కాకినాడ(Kakinada)లో బాణసంచా దుకాణాల కేటాయింపు రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది. అధికారుల తీరును తప్పుపడుతూ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(Vanamadi venkateswarao) వర్గీయులు రోడ్డెక్కారు. ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేశారు. ఇప్పటికే పర్లోపేట దగ్గర వైన్‌షాపు కేటాయింపు విషయంలో రెండు పార్టీల మధ్య వివాదం నెలకొంది. ఏలూరు జిల్లా దెందులూరులోనూ ఇదే పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ఉన్నారా లేదా అన్నది స్పష్టం చేయాలని టీడీపీ నేత సైదు గోవర్ధన్‌(Saidu Govardhan) ప్రశ్నిస్తున్నారు. పవన్‌ కొల్లేరును సర్వ నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకుడిగా తనకు అడిగే హక్కు ఉందన్నారు. శ్రీ కాళహస్తిలో టీడీపీ, జనసేన నేతలు ఒకరినొకరు గట్టిగా తిట్టేసుకున్నారు. దాంతో సమీక్ష సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సత్యవేడు సమీక్ష కూడా గొడవల కారణంగా సగంలోనే ముగిసింది. చంద్రగిరిలోనూ టీడీపీ, జనసేన నేతలు వాదులాడుకున్నారు. ఇలా చాలా చోట్ల టీడీపీ, జనసేన నేతలకు పడటం లేదు. పైకి బాగానే కనిపిస్తున్నా లోలోపల ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story