ఇండిగో వివాదం కారణంగా గడిచిన రెండు మూడు రోజుల్లోనే లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇండిగో వివాదం కారణంగా గడిచిన రెండు మూడు రోజుల్లోనే లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అనేకమంది తమ షెడ్యూల్‌ను పోస్టు పోన్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా భారత దేశ పరువు తీసిన ఘటన ఇది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ఏవియేషన్ రంగంలో ఈ స్థాయిలో అప్రతిష్ట, ఈ స్థాయిలో అవమానం భారతదేశానికి ఎప్పుడూ జరగలేదు. మోదీ(PM Modi) సర్కారు నేతృత్వంలో భారతదేశం పరువు అంతర్జాతీయంగా పూర్తిగా పోయింది. ఈ మొత్తం పోయిన పరువుకి కారణం ఇండిగో (Indigo)అనే సంస్థ పేరుతో ఇండిగో పైన నెపం వేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.

ఇది ఇలా ఉండగా టీడీపీ (TDP)నుంచి డిబేట్‌కు వచ్చిన వాళ్లను అర్నబ్‌ గోస్వామి(Arnab Goswami) తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఏవియేషన్‌ మంత్రి రామ్మోహన్నాయుడి వ్యవహారశైలిని అర్నబ్‌ ఎండగడుతున్నారు. నిన్న రాత్రి జరిగిన చర్చలో టీడీపీ గెస్ట్ కోసం ఓ కుర్చీ వేసి ఉంచారు. టీడీపీ రిపబ్లిక్‌ టీవీ(Republic TV)ని బ్యాన్‌ చేసిందట. ఎందుకు చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మాకు వ్యక్తిగత అజెండాలు లేవు కానీ బ్లాక్‌మెయిల్‌ పాలిటిక్స్ రిపబ్లిక్‌తో పనిచేయవని అర్నాబ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ బాధ్యత అంతా ఎయిర్‌లైన్‌దేనని మంత్రి చెప్తున్నారు. కానీ నిజంగా DGCAను మంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంది. పైలట్ పని గంటలు, విమాన భద్రత, వైమానిక నిర్వహణకు బాధ్యత వహించే సంస్థ DGCA. మంత్రిత్వ శాఖ కూడా ఎందుకు బాధ్యత వహించదు? DGCA ఎలా బాధ్యత వహించదు? మంత్రి ఎలా దోషి కాదు? మంత్రి ఇండిగోతో పోరాడలేరు. కాబట్టి, మంత్రి రామ్మోహన్నాయుడు (Rammohan Naidu)రిపబ్లిక్‌తో పోరాడాలనుకుంటున్నారు. మీరు ఇండిగోతో పోరాడాలి. ప్రజల కోసం పోరాడాలని అర్నబ్‌ ఆవేశం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ టీవీ ప్రజల కోసం పోరాడుతుంటే.. మంత్రేమో రిపబ్లిక్‌తో పోరాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మంత్రి కూడా డైరెక్ట్ ప్రజలతో పోరాడుతున్నారనే చెప్పాలి. ఈ రకమైన సంక్షోభాన్ని నివారించడానికి జనవరి 2024లో నిబంధనలు పెట్టింది. మంత్రి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు అర్నబ్

Updated On
ehatv

ehatv

Next Story