సోషల్‌ మీడియాలో జీవీరెడ్డి సంచలన పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

సోషల్‌ మీడియాలో జీవీరెడ్డి సంచలన పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేస్తూ ' నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల బారి బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీ (TDP)లోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను.ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి . రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత' అని జీవీరెడ్డి అన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story