TDP Kanna Lakshmi Narayana : సీఎం జగన్పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కన్నా
తెలుగువాడి సత్తాచాటి అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకోసం పోరాటం చేసిన మహనీయుడు ఎన్టీఆర్(NTR) అని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. పేద, బడుగు, బాలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించి రాజకీయ సమానత్వాన్ని చాటిన ఘనుడు ఎన్టీఆర్ అని అన్నారు.

Ex-Minister Kanna
తెలుగువాడి సత్తాచాటి అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకోసం పోరాటం చేసిన మహనీయుడు ఎన్టీఆర్(NTR) అని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. పేద, బడుగు, బాలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించి రాజకీయ సమానత్వాన్ని చాటిన ఘనుడు ఎన్టీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమ గీతం పాడటానికి ప్రజలు, కార్యకర్తలు ఇంకా సంవత్సరం పాటు పోరాటం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్(Jagan) రాజధానిలో రాక్షస క్రీడ పేరుతో పేదల ఇళ్ల స్థలాలను ఇవ్వడమే జగన్ నేర చరిత్రకు నిదర్శనమని ఆరోపించారు. రాజధానిని సర్వనాశనం చేసి అమరావతిని(Amaravathi) చంపటానికి ఇళ్ల స్థలాల నాటకమే జగన్ కుట్రకు రూపమన్నారు. రాజధానిలో పేదలను ఇళ్ల స్థలాల పేరుతో మోసం చేయడానికి ఈరోజు సభను పెట్టారని ఆరోపించారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏమిటో అందరూ గమనించాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం దిక్కరించే స్థాయికి ముఖ్యమంత్రి వెళ్లడం చూస్తే ఆవేదన కలుగుతుందన్నారు. నవంబర్ నెలలో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పేదలపై ఎక్కడలేని ప్రేమ తానొక్కడే చూపిస్తున్నట్లుగా జగన్ నాటకం ఆడుతున్నారని అన్నారు. పేదల సంక్షేమం పేరుతో దోపిడీకి దారితీసిన దరిద్రుడు జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసింది మొదలు.. పేదల రక్తాన్ని తాగుతున్న నరరూప రాక్షసుడని ధ్వజమెత్తారు. పన్నుల మోత, నిత్యావసర వస్తువుల మోత, కరంటు చార్జీల మోత.. మోతలమీద మోతలు పేదలపై మోగిస్తున్నాడని అన్నారు. వైసీపీ పాలనను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
