చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. ఆయన తండ్రి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు.

TDP MPs Protest In Delhi
చంద్రబాబు అరెస్టు(Chandrababu)ను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎంపీలు(TDP MPs) ఢిల్లీ(delhi)లో ఆందోళనలు చేపట్టారు. టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh).. ఆయన తండ్రి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ ఘాట్(Mahatma Gandhi Ghat)ను సందర్శించి నివాళులర్పించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. రాజ్ ఘాట్(Raj Ghat) ఎదుట మౌనదీక్షలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. నేతలు చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు టీడీపీ ఎంపీలు పార్లమెంట్(Parliament) లో చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.
