Devineni Chandrasekhar: టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఇంట విషాదం
ఆయన్ను కాపాడడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రోజు తెల్లవారుజామున
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట విషాదం నెలకొంది. దేవినేని ఉమ సోదరుడు దేవినేని చంద్రశేఖరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరితిత్తులకు సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న దేవినేని చంద్రశేఖర్, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
చంద్రశేఖర్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. గత మూడురోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు దేవినేని ఉమ. ఆయన్ను కాపాడడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రోజు తెల్లవారుజామున చంద్రశేఖర్‌రావు కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఈ వార్తతో దేవినేని కుటుంబంలోనూ.. అభిమానుల్లోనూ విషాదం నెలకొంది. ఇక, ఈ రోజు ఉదయం 8 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి కంచికచర్లకు చంద్రశేఖర్ పార్థివదేహాన్ని తరలించారు. ఈ రోజు సాయంత్రం కంచికర్లలో చంద్రశేఖర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దేవినేని చంద్రశేఖరరావు మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.