TDP vs YCP Social Media Battle : డల్లాస్ టూర్.. KTR vs Lokesh.. టీడీపీ సోషల్ మీడియా వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా..!
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న కెనడా దేశాల పర్యటనకు వెళ్లారు.

పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న కెనడా దేశాల పర్యటనకు వెళ్లారు. 5 రోజుల పాటు ఆయా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. తొలుత అమెరికాకు చేరుకున్న నారా లోకేష్‌కు డల్లాస్‌లో ఏపీ ఎన్నార్టీ నాయకులు, స్థానిక ప్రవాసాంధ్రుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం.. ఆయన తెలుగు ప్రవాసులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అండగా ఉన్న తెలుగు వారికి ధన్యవాదాలు తెలిపారు.
తాను అమెరికాలోనే చదువుకున్నానని.. ఇక్కడి ప్రపంచ బ్యాంకులోనూ పనిచేశానని నారా లోకేష్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. అమెరికాతో తనకు తొమ్మిది సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. కాగా.. ప్రవాసాంధ్రులు ఎక్కడ ఉన్నా.. వారికి అండగా నిలుస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు చేసిన కృషి.. ఏపీ ప్రజలు బాగుండాలని వారు చేసిన ప్రచారాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. తాను విదేశీ పర్యటనలు పెట్టుకున్నప్పుడు కూడా వారు అంతే మద్దతు ఇస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా వైసీపీపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. టీ-11 అంటూ వైసీపీని సంబోధించిన ఆయన.. వారికి తన పర్యటనలు చూసి, తన ప్రసంగాలు విని.. తనకు వస్తున్న మద్దతును చూసి నిద్ర కూడా పట్టడం లేదన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని తెలిపారు.
అయితే డల్లాస్‌లో ఏర్పాటు చేసిన సభలో అసలు ప్రజలే రాలేదని, గతంలో KTR ఇదే వేదికలో BRS సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని, అసలు ఆ ఆడిటోరియం మొత్తం నిండిపోయిందని, కానీ నేడు లోకేష్ వస్తే ఆడిటోరియంలోని స్థానాలన్నీ ఖాళీగా ఉన్నాయని వైసీపీ విమర్శలు చేస్తోంది. కేటీఆర్ సమావేశం, లోకేష్ సమావేశాన్ని బేరీజు వేస్తూ వైసీపీ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారు.


