ఆంధ్రప్రదేశ్‌ నేతలు తెలంగాణ రాగం పాడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ నేతలు తెలంగాణ రాగం పాడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్(Ys jagan) తెలంగాణ వాళ్లకు రాజ్యసభ ఇస్తే ఇంతెత్తున నోళ్లు లేచాయి. అయినా జగన్ మొండిగా వ్యవహరించారు తెలంగాణ (Telangana)వ్యక్తికి రాజ్యసభ పదవి కట్టబెడితే.. అతను పార్టీని, పదవిని వదిలేసి వెళ్లిపోయారు. పార్టీ పదవి అయితె ఆ పార్టీ అధినేతల ఇష్టం. కాబట్టి ఎవరూ అడగరు అయితే ప్రభుత్వం తరుపున ఇచ్చే పదవులు కుడా తెలంగాణ వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తే ఆంధ్రవాళ్లు చూస్తూ ఊరుకుంటారా. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) మీడియా అకాడమి చైర్మన్ రేస్‌లో తెలంగాణ జర్నలిస్ట్ ఉన్నాడని చర్చ జర్నలిస్ట్ వర్గాలలో చక్కర్లు కొడుతోందట . తెలంగాణాకు చెందిన రిటైర్డ్ జర్నలిస్ట్‌కు ప్రెస్ అకాడమీ చైర్మన్ దాదాపు ఖరారైందనే ప్రచారం మీడియా సర్కిల్స్ లో చర్చగా మారిందని టాక్. అదే జరిగితె ఆంధ్ర జర్నలిస్టు లను అవమానించినట్టె అవుతుందని అక్కడి జర్నలిస్టులు వాపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం నిజమో, కాదో తెలియదు కానీ.. ఒకవేళ నిజమైతె చంద్రబాబు(Chanadrababu) ఒకసారి ఆలోచించి, ఆంధ్ర జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ జర్నలిస్టులు వాపోతున్నారని టాక్. తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు పదవులు ఇస్తారా.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పదవికి సరిపడా అర్హులే లేరా.. చంద్రబాబు గారు ఒకసారి ఆలొచించాలని పలువురు జర్నలిస్టులు గుసగుసలాడుకుంటున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story