Adavuladeevi Murder Case : 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ తెనాలి జిల్లా కోర్టు సంచలన తీర్పు
నిజాంపట్నం మండలం అడవులదీవి కేసులో తెనాలి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ కేసులో కోర్టు 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 2016లో అడవులదీవిలో ఘటన జరిగింది.

Tenali District Court Sensational judgment in Adavuladeevi Murder Case
నిజాంపట్నం(Nizampatnam) మండలం అడవులదీవి(Adavuladeevi) కేసులో తెనాలి జిల్లా కోర్టు(Tenali District Court) సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ కేసులో కోర్టు 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 2016లో అడవులదీవిలో ఘటన జరిగింది. రేపల్లె(Repalle)కు చెందిన జాస్మిన్(Jasmine) మృతి చెందింది. జాస్మిన్ మృతికి శ్రీసాయి(Srisai) సహా మరో యువకుడు కారణమని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. గ్రామస్తుల దాడిలో శ్రీసాయి మృతి చెందాడు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది.
కేసు విచారణ పూర్తవడంతో న్యాయమూర్తి మాలతి(Justice Malathi) బుధవారం తీర్పు వెలువరించారు. మొత్తం 21 మంది నిందితుల్లో నలుగురు ఇప్పటికే మృతిచెందినట్లు పేర్కొన్నారు. మిగిలిన 17 మందిలో నలుగురికి కేసు నుండి ఉపశమనం కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. మరో 13 మందిని నిందితులుగా తేలుస్తూ న్యాయమూర్తి యాజవజ్జీవ శిక్ష విధించారు. కోర్టు తీర్పుపై బాపట్ల జిల్లా ఎస్పీ(Bapatla SP) వకుల్ జిందాల్(Vakul Jindhal) మాట్లాడుతూ.. చట్టం ఎవరికి చుట్టం కాదని.. నేరారోపణ రుజువైనప్పుడు కచ్చితంగా శిక్ష తప్పదని.. నేరస్తులకి శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
