'విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్.

విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం.సూపర్ సిక్స్‌(Super Six)లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 'తల్లికి వందనం' (Thalliki Vandanam)పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది'' అంటూ నారా లోకేష్‌ (Nara Lokesh)ట్వీట్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story