ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జూలై నెల రెండవ తారీఖున నోటిఫికేషన్ వెలువడింది.

ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జూలై నెల రెండవ తారీఖున నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆగస్టు నెల మూడో తేదీతో ముగియనుంది. దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీని పొడిగించడం జరిగింద‌ని.. అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌లో కోరింది. ఇప్ప‌టివ‌ర‌కూ టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబర్ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరగనున్నాయి అని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story