కోడి పందాల కోసం ఏకంగా స్టేడియాలే నిర్మాణం

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. కొత్త అల్లుళ్లు, భోగి మంటలు, గంగిరెద్దుల సందడితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందాల జోరు మొదలైంది. సంక్రాంతి కోడి పందాలకు నూజివీడు, గన్నవరం సరిహద్దుల్లో 28 ఎకరాల విస్తీర్ణంలో హైటెక్ బరులు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి 13 వరకు నిరంతరాయంగా కోడి పందాలు ఉంటాయంటూ ప్రముఖులకు ఆహ్వానపత్రికలూ అందజేస్తున్నారు. వీఐపీల కోసం 80 మంది బౌన్సర్లను రప్పిస్తున్నారు. రోజుకు రూ.కోట్ల పందాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. విజేతలకు బ్రెజా, థార్ కార్లను బహుమతులుగా ప్రకటించారు.

Updated On
ehatv

ehatv

Next Story