Wife-Boy Freind: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య..! ఆమెను తీసుకొచ్చిన భర్త ఏం చేశాడంటే..!

వివాహేతర సంబంధాలు రోజు రోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. సమాజంలో అదొక్కటే తక్కువ అయినట్లు అడ్డదారులు తొక్కుతున్నారు మహిళలు, పురుషులు. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్న భర్త, ఆగ్రహంతో ఆమెను హతమార్చాడు. భార్య ప్రవర్తన నచ్చని భర్త చివరకు ఆమె గొంతు కోసి హతమార్చిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. అనంతపురం వన్‌టౌన్‌ పీఎస్‌ పరిదిలోని యల్లమ్మ కాలనీలో వీరాంజనేయులు, లక్ష్మీ గంగ (30) దంపతుల నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరాంజనేయులు తాపీ మేస్త్రీ పనులకు వెళ్తుండేవాడు. లక్ష్మీగంగ ఇంట్లోనే చీరల వ్యాపారంతో పాటు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఓ డెయిరీలో పనిచేస్తోంది. ఈక్రమంలో కొంత కాలంగా భార్య మరో యువకుడితో చనువుగా ఉంటోంది. ఈ విషయాన్ని భర్త గమనించాడు. ఆమెకు నచ్చచెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాకపోగా ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో వీరాంజనేయులు ఫిర్యాదుతో వన్‌టౌన్‌ పోలీసులు స్పందించి రెండు రోజుల క్రితం లక్ష్మీ గంగను పీఎస్‌కు పిలిపించి దంపతులిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. మంగళవారం పొద్దుపోయాక దంపతులిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. బుధవారం వేకువజామున గాఢ నిద్రలో ఉన్న భార్య గొంతను కొడవలితో కోసి హతమార్చిన అనంతరం వీరాంజనేయులు పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. అయితే వీరాంజనేయులు ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడలేదని, ఇందులో మరొకరి సాయం కూడా ఉందని హతురాలు లక్ష్మీ గంగ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Updated On
ehatv

ehatv

Next Story