గిట్టుబాటు ధర లేక..అప్పులు తీర్చలేమని మనస్తాపంతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

గిట్టుబాటు ధర లేక..అప్పులు తీర్చలేమని మనస్తాపంతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు (Palnadu)జిల్లా నాదెండ్ల మండల కేంద్రంలోని రామాపురం కాలనీకి చెందిన నాసం ఆదినారాయణ (Adinarayana)(45) అనే రైతు గిట్టుబాటు ధర లేక అప్పులు చెల్లించే పరిస్తితి లేక ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన సిరిబోయిన గోపాల్ రావు (Gopal Rao)(44) అనే రైతు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవడంతో, తన ట్రాక్టర్‌ను స్వాధీనం అప్పు ఇచ్చిన వారు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు. ఇక మరో రైతు ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన బండి కొండయ్య(Kondaiah) (52) అనే రైతు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, అప్పులు తీర్చలేనని ఆవేదనతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు

Updated On
ehatv

ehatv

Next Story