☰
✕
Fun bucket Bhargav : ఇన్‌స్టా ఇంఫ్లూయెన్సర్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
By ehatvPublished on 10 Jan 2025 12:55 PM GMT
తెలుగు యూట్యూబర్.. “ఫన్ బకెట్“ ఫేమ్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
x
తెలుగు యూట్యూబర్.. “ఫన్ బకెట్“ ఫేమ్ భార్గవ్ మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి 20 సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.4,00,000/- జరిమానా విధిస్తు తీర్పు వెలువరించిన గౌరవ న్యాయస్థానం.
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికలపై పలుమార్లు హత్యాచారానికి పాల్పడిన ఘటనలో, ముద్దాయి అయిన చిప్పాడ భార్గవ్ కి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, బాధితురాలికి నిందితుడు రూ.4,00,000/- నష్ట పరిహారంగా ఇవ్వాలని సంచలన తీర్పు వెలువరించిన గౌరవ పోక్సో కోర్టు. ముద్ధాయికి శిక్ష పడేవిధంగా కృషి చేసిన అధికారులకు డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు అభినందించారు.
ehatv
Next Story