TTD Suprabhata Seva : జనవరి 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం..
పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ(suprabhata seva) పునఃప్రారంభం కానుంది.

TTD Suprabhata Seva
పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ(suprabhata seva) పునఃప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. జనవరి 14వ తేది ధనుర్మాస(Dharnurmasam) ఘడియలు పూర్తి కానుండడంతో 15 నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించ వలసిందిగా టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా, ఈ నెల 16న ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం జరగనున్నాయి.


