సీఎం వైఎస్ జగన్ రేపు ఏలూరు జిల్లా నూజివీడు పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.

Tomorrow CM Jagan will visit Nuzvid
సీఎం వైఎస్ జగన్(YS Jagan) రేపు ఏలూరు(Eluru) జిల్లా నూజివీడు(Nuzvid) పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు షెడ్యూల్(Schedule) విడుదల చేశారు. పర్యటనలో భాగంగా.. 2003కు మందు అసైన్‌మెంట్ భూముల(Assignment Lands)కు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
ఈ మేరకు 17వ తేదీ ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి నూజివీడు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 2003కు మందు అసైన్‌మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
