Avinash Reddy : అవినాష్ బెయిల్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. కోర్టుకు చేరుకున్న సీబీఐ అధికారులు
హైకోర్ట్ లో(High Court) నేడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి(avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. నిన్న సుదీర్ఘ వాదనల అనంతరం విచారణను కోర్టు శనివారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే సీబీఐ(CBI) అధికారులు హైకోర్ట్ కు చేరుకున్నారు.

Avinash Reddy
హైకోర్ట్ లో(High Court) నేడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి(avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. నిన్న సుదీర్ఘ వాదనల అనంతరం విచారణను కోర్టు శనివారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే సీబీఐ(CBI) అధికారులు హైకోర్ట్ కు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని నిన్న సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏదో సాకు చూపి తప్పించుకుంటున్నారని వెల్లడించారు. వైఎస్ వివేకా(YS Viveka Case) హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందని.. హత్యకు రాజకీయం కారణం ఉందని సీబీఐ లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరవుతుందా.. లేదా అనే విషయమై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు వివేకా హత్యకేసులో అరెస్టై జైలులో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి.. భాస్కర్‌రెడ్డిని వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
