ఎమ్మెల్యే కోటాలో(MLC) ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఎమ్మెల్యే కోటాలో(MLC) ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీకి(TDP) చెందిన‌ సి. రామచంద్రయ్య(C.Rma chandraiah), జ‌న‌సేన(Janasena) అభ్య‌ర్ధి పిడుగు హరి ప్రసాద్(Pidugu prasad) లచే శాసన పరిషత్తు చైర్మన్ కొయ్యే మోషేను రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ.. శాసన పరిషత్తు నియమ నిబంధనల పుస్తకాలను నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేశారు. సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కార్యక్రమం నిర్వహించగా.. శాసన మండలి సభ్యులు పంచుమర్తి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం. విజయ రాజు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story