వెనుకటికి ఎప్పుడో ఏ శోభన్‌బాబు సినిమాల్లోనో, ఏ నాగేశ్వరరావు సినిమాల్లోనూ ఇలాంటి సీన్లు ఉండేవి.

వెనుకటికి ఎప్పుడో ఏ శోభన్‌బాబు సినిమాల్లోనో, ఏ నాగేశ్వరరావు సినిమాల్లోనూ ఇలాంటి సీన్లు ఉండేవి. ఇద్దరు హీరోయిన్లలో ఒకరు త్యాగం చేయడమన్నమాట! ఇక్కడ మాత్రం హీరోయిన్లు ఇద్దరూ త్యాగం చేసి హీరోకు మరో హీరోయిన్‌తో పెళ్లి చేశారు. కన్‌ఫ్యూజన్‌గా ఉంది కదూ! డిటైల్‌గా చెబుతా..! ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అల్లూరి సీతారామరరాజు జిల్లా(alluri Sita rama raju) పెదబయలు మండలంలో ఈ చిత్రం జరిగింది. కించూరు(kinchuru) గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000 సంవత్సరంలో పార్వతమ్మతో పెళ్లి జరిగింది. ఆమెకు పిల్లలు పుట్టలేదు. దాంతో 2005లో అప్పలమ్మను మనువాడాడు పండన్న. 2007లో ఆమెకు ఓ అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత పిల్లలు కలగలేదు. ఒక్క సంతానంతో సంతృప్తి చెందని పండన్న మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇందుకు ఇద్దరు భార్యలు అనుమతి ఇచ్చారు. జూన్‌ 25వ తేదీన ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు పండన్న. అన్నట్టు ఈ పెళ్లికి ఇద్దరు భార్యలు పెద్దలుగా వ్యవహరించారు. వారే పెళ్లి కార్డులు కొట్టించారు. బ్యానర్లు వేయించారు. సంతానం కోసం తన భార్యలు త్యాగం చేశారని పండన్న మురిసిపోతున్నాడు!

Updated On
Eha Tv

Eha Tv

Next Story