ఓ వ్యక్తి తన భర్త అంటూ ఒకరు, లేదు తన భర్త అంటూ మరొక మహిళ ఇద్దరూ కీచులాడుకున్నారు.

ఓ వ్యక్తి తన భర్త అంటూ ఒకరు, లేదు తన భర్త అంటూ మరొక మహిళ ఇద్దరూ కీచులాడుకున్నారు. అవమానం భరించలేక ఇద్దరూ పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నం(Suicide) చేశారు. అన్నమయ్య జిల్లా(Annamayya district) మదనపల్లి(Madanapalli)లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చంద్రకాలనీకి చెందిన రెడ్డిశేఖర్(Reddy Shekar), దుర్గమ్మ(Durgamma) దంపతులు స్థానిక మార్కెట్‌ యార్డులో పనిచేస్తున్నారు. ఈ జంటకు ఇంకా సంతానం కలగలేదు. కడప(Kadapa)కు చెందిన శ్రీనివాసులు(Srinivasulu)భార్య లక్ష్మి(Lakshmi) భర్తను వదిలేసి ఇదే మార్కెట్‌యార్డులో పనిచేస్తోంది. రెడ్డిశేఖర్‌కు లక్ష్మితో పరిచయం కాస్త ప్రేమగామారింది. ఇద్దరూ రెండు వారాల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం రెడ్డిశేఖర్‌ భార్య దుర్గమ్మకు తెలియడంతో లక్ష్మితో గొడవపడింది. రెడ్డిశేఖర్‌ తన భర్త అంటే తన భర్త అని ఇద్దరూ కీచులాడుకున్నారు. దీంతో అవమానభారంగా భావించిన ఇద్దరు కూడా పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇద్దరినీ మాలపల్లి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించగా వైద్యుల సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాల నుంచి బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెడ్డిశేఖర్‌ వ్యవహారంపై విచారణ చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story