Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో (హైపోక్సియా) బాధపడుతున్నారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలిగింది, దీంతో ఆయన్ను కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమస్య ముందునుంచీ ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితుల వల్ల మరింత తీవ్రమైందని ఆయన భార్య పంకజ శ్రీ తెలిపారు. వైద్యులు ఈ పరిస్థితిని 'సెకండ్ గ్రేడ్'గా నిర్ధారించి, ఇన్హేలర్ వాడమని సూచించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు, వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, వంశీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన్ను ఎయిమ్స్‌కు తరలించాలని డిమాండ్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story