Vellampali Srinivas : టీడీపీని జనసేనలో కలుపుకోవాలని తాపత్రయం
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు(Vellampalli Srinivas Rao) జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. అరెస్టై జైలులో ఉన్న చంద్రబాబు(Chandrababu) మీద జనసేనాని మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు పోతాడా.,? ఎప్పుడు టీడీపీని జనసేనలో కలుపుకుంటామా?

Vellampali Srinivas
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు(Vellampalli Srinivas Rao) జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. అరెస్టై జైలులో ఉన్న చంద్రబాబు(Chandrababu) మీద జనసేనాని మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు పోతాడా.,? ఎప్పుడు టీడీపీని జనసేనలో కలుపుకుంటామా? అని తాపత్రయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రయివేటు వైద్యం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు అడగడం లేదన్నారు. పవన్ షూటింగ్స్‌తో ఫామ్ హౌస్‌లో బిజీగా ఉంటాడని.. అంతేకానీ చంద్రబాబు మీద ఆయనకు ఏమాత్రం ప్రేమ లేదన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీకి అనుమానం ఉంటే కోర్టుకు వెళ్లాలని.. కోర్టు పరిధిలోకి వెళ్లాక ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. రోజుకు 24 గంటలు ఉంటే కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటు అన్నారు. టీడీపీ వాళ్లని చూసి వాళ్ల కేడరే నవ్వుకుంటోందన్నారు. సంకేళ్లు వేసుకోవడం ద్వారా తమకూ సంకేళ్లు వేయాలని టీడీపీ పిలుస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ తలపెట్టిన న్యాయానికి సంకేళ్లు కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేదన్నారు. చంద్రబాబుకు ఉన్న రోగాలు ఈ నెల రోజుల్లో వచ్చినవి కాదని.. ఆయనకు లేని రోగం లేదంటూ కుటుంబ సభ్యులే దేశమంతా ప్రచారం చేస్తున్నారన్నారని అన్నారు. చంద్రబాబు ఉక్కు సంకల్పం ఉన్న మనిషి కాదని.. తప్పుడు మనిషి అన్నారు
"Written By : Senior Journalist Sreedhar"
