Lovers Sucide Attempt : అర్థరాత్రి నదిలో దూకిన ప్రేమజంట.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు
శ్రీకాళహస్తి(Sri kalahasthi) స్వర్ణముఖి(Swarnamukhi) నదిలో దూకి ఆత్మహత్య(sucide) చేసుకోబోయిన ప్రేమ జంటను పోలీసులు కాపాడారు. శ్రీకాళహస్తికి చెందిన వేణు(26)(venu), బిందు శ్రీ(22)(bindhusri) ఇరువురూ ఒకరికొకరు ప్రేమించుకున్నారు. కులాలు వేరు అవడంతో ప్రేమ వివాహం చేసుకున్నా కలిసి బ్రతకలేమనుకున్నారు. కలిసి బతకలేకపోయినా..

Lovers Sucide Attempt
శ్రీకాళహస్తి(Sri kalahasthi) స్వర్ణముఖి(Swarnamukhi) నదిలో దూకి ఆత్మహత్య(sucide) చేసుకోబోయిన ప్రేమ జంటను పోలీసులు కాపాడారు. శ్రీకాళహస్తికి చెందిన వేణు(26)(venu), బిందు శ్రీ(22)(bindhusri) ఇరువురూ ఒకరికొకరు ప్రేమించుకున్నారు. కులాలు వేరు అవడంతో ప్రేమ వివాహం చేసుకున్నా కలిసి బ్రతకలేమనుకున్నారు. కలిసి బతకలేకపోయినా.. కలిసి చావాలనే ఉద్దేశంతో శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో వీరు నదిలో దూకారు. ప్రేమజంటను గమనించిన కాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ కన్నయ్య.. పోలీసు బృందంతో సహా అక్కడికి చేరుకొని నదిలో దూకి ప్రేమ జంటను ఒడ్డుకు చేర్చి కాపాడారు. ప్రేమజంటను కాపాడిన పోలీసు బృందంలో కన్నయ్యతో పాటు రవిచంద్ర, గిరిబాబు, మునీంద్ర ఉన్నారు. ప్రాణాలకు తెగించి తమ పిల్లలను కాపాడినందుకు వారి కుటుంబ సభ్యులు, అక్కడి ప్రజలు పోలీస్ బృందంకు ధన్యవాదాలు తెలిపారు.
