తిరుమలలో చాగంటికి జరిగిన అవమానమేంటి..!

ఈ వీడియో నేను ఓ జర్నలిస్టుగా కాకుండా తిరుమల శ్రీవారి భక్తుడిగా చేస్తున్నా. టీటీడీ (TTD) దృష్టికి తీసుకొస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ (NDA) ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి తీసుకొస్తున్నా. ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteshwar Rao) ఇటీవల తిరుమలకు వచ్చారు. ఈనెల 13, 14, 15 తేదీల్లో తిరుమలలో ఉన్నారు. ఆయన తిరుమలకు వస్తున్నారన్నదానిపై టీటీడీ ప్రొసీడింగ్స్‌ కూడా ఇచ్చింది. ఈ ప్రొసీడింగ్స్‌ ప్రకారం ఆయన ఎక్కడ ఎక్కడ ఏఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆయన వెంట ఎంత మంది వస్తున్నారు, ఆయనకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఆయన భోజన వసతులతో పాటు అన్ని విషయాలపై టీటీడీ ప్రొసీడింగ్స్‌ను విడుదల చేసింది. ఆయన ఏ పర్పస్‌ కోసమైతే తిరుమల వచ్చారో ఆ కార్యక్రమం కాకుండానే ఆయనను పంపించారు. ఆయన ఓ ప్రవచనం కోసం వచ్చారు.. ఆ ప్రవచన కార్యక్రమం లేకుండానే చాగంటి కోటేశ్వరరావు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యాలు, కైంకర్యాలు, పూజలు నిర్వహించడంతో పాటు హిందూ ధర్మ ప్రచారం కోసం సంకల్పించింది. ఎస్వీబీసీ (SVBC) చానెల్‌ కూడా ఆ కార్యక్రమంలో భాగంగానే జరిగింది. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత హిందూ ధర్మ ప్రచారం కోసం చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్‌ హోదా కల్పించింది. ఈ హోదా ఉన్న చాగంటికి తిరుమలలో జరిగిన అవమానమేంటి..! ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' లోతైన విశ్లేషణ ఈ వీడియోలో..!

Updated On
ehatv

ehatv

Next Story