ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం(TDP)- జనసేన(Janasena) పార్టీలలో (బీజేపీ(BJP) కూడా ఉందనుకోండి) సఖ్యత లోపిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం(TDP)- జనసేన(Janasena) పార్టీలలో (బీజేపీ(BJP) కూడా ఉందనుకోండి) సఖ్యత లోపిస్తున్నది. ప్రతిచోటా తెలుగుదేశంపార్టీ ఆధిపత్యమే కనిపిస్తోంది. జనసైనికులను ఆ పార్టీ చీపురుపుల్లాలా తీసిపడేస్తున్నది. మచిలీపట్నంలో జనసేన నాయకుడు యర్రంశెట్టి నానికి జరిగిన ఘోర అవమానమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నాయకుడు శంకు శ్రీను ఆయనతో కాళ్లు మొక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అందరికి తెలిసిపోయిన ఈ ఘటనపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(CM pawan kalyan) ఎందుకో మౌనంగా ఉంటున్నారు. ఆయన ఎందుకు రియాక్టవ్వడం లేదో కార్యకర్తలకు తెలియడం లేదు. సొంతపార్టీ నాయకుడితో అవమానకరంగా కాళ్లు పట్టించుకున్నా జనసేనాని పవన్‌కు చీమ కుట్టినట్టయినా లేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. తెలుగుదేశంపార్టీలో కలిసి ప్రభుత్వంలో భాగమైనంత మాత్రనా ఇలా అవమానాలు భరించాల్సిందేనా? అని మథనపడుతున్నారు. కాళ్లు మొక్కించుకున్న టీడీపీ నాయకుల కంటే ఏ మాత్రం స్పందన లేని తమ నాయకులను చూస్తుంటేనే కోపం వస్తున్నదని చెబుతున్నారు. ఇలాగైతే కలిసి ఉండటం కష్టమేనని తమలో తాము అనుకుంటున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story